ధోనీ ముందు వరల్డ్ రికార్డ్

మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ముందు మరో అద్భుత రికార్డు ఉంది. మూడు మ్యాచులు ఆడితే వరల్డ్ క్రికెట్‌ లో ఎక్కువ మ్యాచ్‌ లు ఆడిన వికెట్‌ కీపర్‌ గా మ‌హీ అరుదైన ఘ‌న‌త అందుకుంటాడు. సొంత‌గ‌డ్డ‌పై ఈ నెల 24 నుంచి టీమిండియా.. ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌ లు ఆడనుంది. ఈ రెండు సిరీస్ లో ధోనీ ఈ రికార్డును చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని ఫార్మాట్లలో కలిపి ధోనీ ఇప్ప‌టి వ‌ర‌కు 594 మ్యాచ్‌ లకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ లిస్టులో సౌతాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ 596 మ్యాచ్‌ లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్ర‌స్తుతం అతని తర్వాత ధోని (594) త‌ర్వాతి స్థానంలో ఉన్నాడు. శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర 499 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉండగా.. 485 మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

మరో మూడు మ్యాచ్ లు ఆడితే.. అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన వికెట్ కీప‌ర్ల లిస్టులో ధోనీ నంబ‌ర్‌వ‌న్ స్థానానికి చేరుకుంటాడు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా టూర్‌ లో ..ఆసీస్‌ తో టీ20ల్లో మూడు మ్యాచుల్లో భారత్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించి.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు ధోనీ.

 

Latest Updates