ఎమ్మెల్సీగా ప్రభాకర్‌ రావు ప్రమాణం

MS Prabhakar Rao elected MLC under Hyderabad Local Bodies constituency

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎం.ఎస్‌. ప్రభాకర్‌ రావు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రభాకర్‌ రావును హోం మంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌ రెడ్డి, ఆకుల లలిత,  రాజేశ్వర్‌ రావు, ఫారూఖ్‌ హుస్సేన్‌ , జాఫ్రి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌ రెడ్డి అభినందించారు. హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా నుంచి ప్రభాకర్‌ రావు వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Latest Updates