వీహెచ్​పై చర్యలు తీసుకోవాలి…

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుపై చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ సేవా సంఘం కన్వీనర్ ఉప్పరి నారాయణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ క్రీయాశీలక కార్యకర్తలపై వీహెచ్​ విరుచుకుపడటం దారుణమని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని ఆదివారం పత్రిక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ విషయంలో నగేశ్​పై చర్యలు తీసుకుంటే పార్టీలకు అతీతంగా ముదిరాజ్ సమాజం ఏకతాటిపైకి వచ్చి, ఆయనకు అండగా ఉంటుందన్నారు. నగేశ్​పై జరిగిన దాడిని ముదిరాజ్ సేవా సమితి అధ్యక్షుడు సురేందర్​బాబు తీవ్రంగా ఖండించారు. 48గంటల్లో వీహెచ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇందిరా పార్కు ఘటనలో నగేశ్​ తప్పేమీ లేదన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని వెల్లడించి..వీహెచ్​పై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు

Latest Updates