పాక్ పీఎం ఇమ్రాన్ కు ఒక అవకాశమిద్దాం: ముఫ్తీ

కశ్మీర్: పాక్ గత పాలకుల తీరును తప్పుబడుతూనే ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముప్తీ వెనకేసుకొచ్చారు. పుల్వామా దాడిపై స్పందిస్తూ కొత్త ప్రభుత్వానికి ఒక చాన్స్ ఇచ్చి చర్చలకు రావాలన్న ఇమ్రాన్ వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. ఆయన కొత్తగా అధికారంలోకి వచ్చారని, పుల్వామా దాడి ఆధారాలు ఇచ్చి చూద్దామఅన్నారు. కొత్తగా మళ్లీ అడుగు వేద్దామన్న ఆయన కోరికను ఎందుకు మన్నించకూడదని ఆమె అన్నారు. ఆధారాలన్నీ ఇచ్చి ఆయనేం చేస్తారో చూద్దామని చెప్పారు ముఫ్తీ. అయితే గతంలో పఠాన్ కోట్, ముంబై దాడుల సమయంలో ఆధారాలు ఇచ్చినా నాటి పాక్ పాలకులు ఏ చర్యలూ తీసుకోలేదని ఆమె అన్నారు.

యుద్ధం తెలివిలేనోళ్ల ఆలోచన

చర్చలు జరిపే అవకాశం ఉన్నప్పుడు యుద్ధం గురించి మాట్లాడడం తెలివి లేనోళ్లు చేసే పని అని ముఫ్తీ అన్నారు. రెండు దేశాలు అణు బాంబు కలిగి ఉన్నాయని, ఇది తెలిసీ చర్చలు జరిపే ఆప్షన్ వదిలేసి, యుద్ధం అనే ఆలోచన ఎవరూ చేయరని ఆమె చెప్పారు.

పాక్ కూడా ఉగ్ర బాధిత దేశమంటూనే.. భారత్ యుద్ధానికి వస్తే తిప్పికొడతామని ఇమ్రాన్ ఖాన్ చెప్పిన నేపథ్యంలో ముఫ్తీ ఇలా మాట్లాడడం వివాదాస్పదంగా మారింది.

Latest Updates