కలిసొచ్చిన కరోనా..ఆరునెలల పాటు గంటకు రూ.90కోట్లు సంపాదించిన ముఖేష్ అంబానీ

మీకో సామెత గుర్తుండే ఉంటుంది కరోనా కష్టకాలమైనా సరే ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదవారు మరింత నిరు పేదగా తయారవుతున్నాడని ఇదిగో సరిగ్గా ఇదే జరిగింది.

ఐఐఎఫ్​ ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ  9వ సారి టాప్ లో నిలిచారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన ఆరునెలల పాటు ప్రతీ గంటకు రూ.90కోట్లు అర్జించారు. ఇదే లాక్ డౌన్ లో రూ.2,77,000 కోట్ల నుంచి రూ.6,58,000కోట్లకు పెరిగింది.

మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ – ( రూ.6,58,400)

రెండో స్థానంలోని హిందూజా సోదరుల సంపద (రూ.1,43,700 కోట్లు)

మూడో స్థానంలోని శివనాడర్, ఫ్యామిలీ  (రూ.1,41,700 కోట్లు)

నాలుగో స్థానంలోని గౌతమ్ అదానీ, ప్యామిలీ (రూ.1,40,200 కోట్లు)

5వ స్థానంలోని అజీమ్ ప్రేమ్‌జీ, కుటుంబం సంపద (రూ.1,14,400)

6వ స్థానంలోని సైరస్ పూనావాలా సంపద (రూ.94,300 కోట్లు)

7వ స్థానంలోని రాధాకిషన్ ధమానీ, ప్యామిలీ సంపద (రూ.87,200 కోట్లు)

8వ స్థానంలోని ఉదయ్ కొటక్ సంపద (రూ.87,000 కోట్లు)

9వ స్థానంలోని దిలీప్ శాంఘ్వీ సంపద (రూ.84,000 కోట్లు)

10వ స్థానంలోని సైరస్ పల్లోంజీ మిస్త్రీ, షాపూర్‌జీ పల్లోంజీ మిస్త్రీల సంపద (రూ.70,000 కోట్ల ) చొప్పున అర్జించినట్లు  ఐఐఎఫ్​ ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 జాబితాలో తెలిపింది.

Latest Updates