దానం చేసే వాళ్ల లిస్ట్‌‌లో వెనకబడ్డ ముఖేష్‌‌ అంబానీ

ఈ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో టాపర్‌‌‌‌‌‌‌‌ శివ్‌‌‌‌‌‌‌‌ నాడార్‌‌‌‌‌‌‌‌
రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో అజీమ్‌‌‌‌‌‌‌‌ ప్రేమ్‌‌‌‌‌‌‌‌జీ

ముంబై :సంపాదించిన సంపదను సమాజానికి తిరిగి ఇచ్చే జాబితాలో ఇండియా కుబేరుడు ముఖేష్‌‌‌‌‌‌‌‌ అంబానీ వెనకబడ్డారు. హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌ అధినేత శివ్‌‌‌‌‌‌‌‌ నాడార్‌‌‌‌‌‌‌‌ ఈ జాబితాలో మొదటి ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచారు. 21 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్ల సంపదను ఛారిటీకి ఇస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచిన అజీమ్‌‌‌‌‌‌‌‌ ప్రేమ్‌‌‌‌‌‌‌‌జీ ఎడెల్‌‌‌‌‌‌‌‌గివ్‌‌‌‌‌‌‌‌ హురున్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఫిలాంత్రపీ 2019 లిస్ట్‌‌‌‌‌‌‌‌లో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. సామాజిక అంశాలపై కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ కుటుంబాలు చాలా కాలం నుంచే పనిచేస్తున్నాయి. కానీ, 2013 లో కంపెనీల చట్టం సీఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌కు నిధులు తప్పనిసరి చేసింది. ఒక పరిమితికి మించి లాభాలార్జించే కంపెనీలు తమ లాభంలో 2 శాతం సీఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ కోసం వెచ్చించాలని నిర్దేశించింది. కంపెనీల డిస్‌‌‌‌‌‌‌‌క్లోజర్లు, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ డేటా రూపొందించారు.

శివ్‌‌‌‌‌‌‌‌ నాడార్‌‌‌‌‌‌‌‌, ఆయన కుటుంబం మొత్తం రూ. 826 కోట్లను ఇవ్వగా, ప్రేమ్‌‌‌‌‌‌‌‌జీ రూ. 453 కోట్లు, అంబానీ రూ. 402 కోట్లు ఇచ్చారు. సివిల్‌‌‌‌‌‌‌‌ లిబర్టీస్‌‌‌‌‌‌‌‌ వంటి అంశాలకు నిధులు ఇవ్వడానికి ఇండియాలో కార్పొరేట్లు భయపడుతున్నారని, ఇచ్చిన నిధుల వల్ల సమాజంపై కనబడే ప్రభావం ఎంతనేది స్పష్టంగా తెలియకపోవడం వల్లా వెనకాడుతున్నారని ఎడెల్‌‌‌‌‌‌‌‌గివ్‌‌‌‌‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌ విద్యా షా వెల్లడించారు. సామాజిక అంశాల కోసం రూ. 5 కోట్లకు మించి దానం ఇచ్చిన వారి సంఖ్య 2018 లోని 38 మంది నుంచి దాదాపు రెట్టింపై 72 కి చేరిందని చెప్పారు. మొత్తం మీద ఫిలాంత్రపీ కోసం ఇచ్చే విరాళాలూ రెట్టింపై రూ. 4,391 కోట్లకు చేరాయని తెలిపారు. చాలా సందర్భాలలో కంట్రిబ్యూషన్స్‌‌‌‌‌‌‌‌ వ్యక్తిగత స్థాయిలోనే వస్తున్నాయన్నారు. కొన్ని మాత్రమే కంపెనీల నుంచి వస్తున్నట్లు చెప్పారు.

సంపన్న కుటుంబాల వారు ఇచ్చే విరాళాలు ఏటేటా పెరుగుతున్నాయని, ఉదాహరణకు వారు పది శాతం నగదు రూపంలో అట్టేపెట్టుకున్నారనుకుంటే అందులో 1.9 శాతాన్ని సమాజం కోసం తిరిగి ఇస్తున్నారని షా తెలిపారు. 2018 లో ఇది 1.5 శాతమే. ఎక్కువ మంది ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ రంగానికే  నిధులు ఇస్తున్నారు. ఆ తర్వాత హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌ నిలుస్తోంది. ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌ కో ఫౌండర్‌‌‌‌‌‌‌‌ నందన్‌‌‌‌‌‌‌‌ నీలెకనీ, ఆయన సతీమణి రోహిణి మాత్రం ఛారిటీ కోసం సొసైటీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేసుకున్నారు. ఇండియాలో వయసు మళ్లే కొద్దీ ఛారిటీ ఇవ్వడం పెరుగుతున్నట్లు షా పేర్కొన్నారు. విరాళాలు ఇస్తున్న వారి సగటు వయసు 64 ఏళ్లుగా ఉండటాన్ని ఈ సందర్బంగా ఉదహరిస్తున్నారు.

Latest Updates