సంపదలో జాక్ మాను అధికమించిన ముఖేశ్ అంబానీ

చైనా ఈకామర్స్ సంస్థ ‘అలీబాబా’ అధినేత జాక్ మాను రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి అధిగమించారు. ఫేస్ బుక్-రిలయన్స్ జియో మధ్య భారీ ఒప్పందం కుదిరింది.దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ నిన్న(బుధవారం) ఏకంగా 10 శాతం వరకు పెరిగింది.  డీల్ తో  ముఖేశ్ సంపద విలువ ఒక్కరోజే 4 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ క్రమంలో… ఆయన సంపద 49 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సంపద పెరగడంతో ముఖేశ్ మరోసారి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. రిలయన్స్ జియోలో.. ఫేస్ బుక్ రూ. 43,574 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇది దాదాపు 10 శాతం వాటాకు సమానం.

 

Latest Updates