రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్ బాస్ జీతం పెరగలే!

ఈసారి కూడా ముఖేష్​ అంబానీ పాకెట్లోకి రూ.15 కోట్లే!

న్యూఢిల్లీ : బిలియనీర్ ముఖేష్ అంబానీ వార్షిక వేతనం ఈ ఏడాది కూడా పెరగలేదు. వరుసగా 11వ ఏడాది రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్  నుంచి ఆయనకు వచ్చిన వార్షిక వేతనం రూ.15 కోట్లుగా ఉన్నట్టు తెలిసింది. 2008–09 నుంచి అంబానీ శాలరీ, అలవెన్స్‌‌లు, కమిషన్లు మొత్తం కలిపి రూ.15 కోట్లుగానే ఉంటున్నాయి. అంతకుముందు అంబానీ రూ.24 కోట్ల మేర సంపాదించేవారు. 2018–19లో అంబానీ వేతనం, అలవెన్స్‌‌లు రూ.4.45 కోట్లుగా ఉండగా.. కమిషన్లు రూ.9.53 కోట్లు. వేతన భత్యాలు రూ.27 లక్షల నుంచి రూ.31 లక్షలకు పెరిగాయి. రిటైర్‌‌‌‌మెంట్ బెనిఫిట్స్ రూ.71 లక్షలుగా ఉన్నాయి. మిగతా ఎగ్జిక్యూటివ్‌‌ల వేతనాలు మాత్రం బాగా పెరిగాయి. కంపెనీ పూర్తి కాలపు డైరెక్టర్లుగా ఉన్న నిఖిల్ ఆర్‌‌‌‌ మేశ్వానీ, హిటల్ ఆర్‌‌‌‌ మేశ్వానీలు  రూ.20.57 కోట్ల చొప్పున సంపాదించారు. గతేడాది వీరి రెమ్యునరేషన్లు ఒక్కొక్కరికి రూ.19.99 కోట్లుగానే ఉన్నాయి.

Latest Updates