ఇవే నాకు చివరి ఎన్నికలు.. ములాయం సింగ్ భావోద్వేగం

ఎన్నికల ప్రచారంలో భావోద్వేగానికి లోనయ్యారు ఎస్సీ అధినేత ములాయం సింగ్ యాదవ్. మెయిన్ పురిలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ములాయం అక్కడి ప్రజలనుద్దేశించి ఇవే తన చివరి ఎన్నికలంటూ కన్నీటి పర్యంతమయ్యారు.  ఎన్నో ఏళ్లుగా మెయిన్ పురి ప్రజలతో  తనకెంతో అనుబంధముందన్నారు .2014 కంటే ఎక్కువ మెజారిటీతో తనను గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇవే  తనకు చివరి ఎన్నికలని చెప్పాలంటే మాటలు రావడం లేదని..తనను దీవించాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.  మెయిన్ పురి నుంచి ములాయం నాలుగు సార్లు ఎంపీగా పోటీచేసి గెలిచారు.

Latest Updates