వందో స్వాతంత్ర్య దినోత్సవం : ఆప్ఘన్ లో భారీ పేలుళ్లు

ఆప్ఘనిస్థాన్ దేశంలోని జలాలాబాద్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. నంగర్ హాన్ ప్రావిన్స్ లోని లోని జలాలాబాద్ పట్టణంలో ఉదయం పలుమార్లు బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం… 66 మంది తీవ్ర గాయాలైనట్టు తెలిసింది.

ఆప్ఘనిస్థాన్ దేశం.. సోమవారం ఆగస్ట్ 19న తమ వందో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. వందో ఇండిపెండెన్స్ డే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈదాడులకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

కాబూల్ లో ఓ ఫంక్షన్ హాల్ లో పేలుడు జరిగిన 2 రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. కాబుల్ బ్లాస్ట్ లో 63 మంది చనిపోయారు. 182 మంది గాయపడ్డారు.

Latest Updates