ఓటీటీ రిలీజ్ నిరాశను కలిగిస్తోంది: ఐనాక్స్

ముంబై: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, యంగ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన గులాబో సితాబో మూవీని ఓటీటీ ప్లాట్​ఫామ్ లో రిలీజ్ చేయనుండటంపై మల్లీప్లెక్స్ థియేటర్స్ చైన్స్ సంస్థ ఐనాక్స్ నిరాశను వ్యక్తం చేసింది. షూజిత్ సర్కార్ డైరెక్షన్ లో తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే నెల 12న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. అయితే దీనిపై ఐమాక్స్ మూవీస్ కొంత ఆందోళనను వ్యక్తం చేసింది. గులాబో సితాబో సినిమా పేరును గానీ ప్రొడక్షన్ హౌస్ పేరును గానీ ప్రస్తావించకుండా ఓ స్టేట్ మెంట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇందులో దీన్ని అస్పష్ట చర్య అని పేర్కొంది.

‘తమ సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నామని ఓ ప్రొడక్షన్ హౌస్ చేసిన ప్రకటన తీవ్ర అసంతృప్తి, నిరాశను కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ విండోయింగ్ ప్రాక్టీస్ నుంచి తప్పుకోవడానికి ఈ మూవీ నిర్మాణ సంస్థ తీసుకున్న నిర్ణయం ఆందోళన, అస్పష్టతను కలిగిస్తోంది. థియేటర్లు, కంటెంట్ క్రియేటర్స్ ఇద్దరూ ఎప్పుడూ పరస్పర భాగస్వామ్య ఒప్పందంలో ప్రయోజనం పొందుతారు. దీంతో ఒకరి చర్యల వల్ల ఇంకొకరి రెవెన్యూ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి విపత్కర సమయాల్లో ఒక భాగస్వామి రిలేషన్ షిప్ ను కొనసాగించడానికి ఆసక్తిగా లేకపోవడం ఇబ్బంది కలిగిస్తోంది. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీని పున: వైభవం దిశగా తీసుకెళ్లాల్సిన సమయంలో ఒకరితో మరొకరు భుజం కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. థియేట్రికల్ రన్స్ ను దూరం చేసుకోవద్దని, సినిమాలను ప్రదర్శించడానికి ఏర్పాటు చేసిన పాతతరం విధానాలతోనే కంటిన్యూ అవ్వాల్సిందిగా కంటెంట్ క్రియేటర్స్ ను కోరుతున్నాం’ అని ఐమాక్స్ విజ్ఞప్తి చేసింది.

Latest Updates