ఎమ్మెల్యే సీతక్క కారు ఢీకొని చిన్నారి మృతి

mulugu-mla-seethakka-car-accident-girl-death

ములుగు జిల్లా: ఎమ్మెల్యే సీతక్క కారుకు ఢీకొనడంతో చిన్నారి చనిపోయిన ఘటన శనివారం మధ్నాహ్నం మంగపేట మండలంలో జరిగింది. ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క ఇవాళ మల్లూరు నృసింహస్వామి  జాతరకు వెళ్తుండగా..  ఆమె కారు బైక్ ను ఢీ కొట్టడంతో బైక్ పైన ఉన్న పాపా అక్కడికక్కడే చనిపోయింది.  బైక్ నడుపుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రీమ్ మెంట్ అందిస్తున్నారు.

బాదితుల స్వగ్రామం మండలంలోని కుమ్రంభీం నగర్. చిన్నారి పేరు స్రవంతి(3). ఏటూరు నాగారం – మంగపేట మద్యలోని జీడివాగు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాదితులను వివరాలను సేకరించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates