క్లాస్ రూమ్‌ను శానిటైజ్ చేసిన సీతక్క

మహబూబాబాద్ జిల్లా: లాక్ డౌన్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.. ఇప్పుడు మరోసారి తన మంచి పనితో వార్తల్లో నిలిచారు. ఈ వారంలో ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల క్రమంలో సీతక్క తన నియోజకవర్గంలో ఏర్పాట్లను పరిశీలించారు. కొత్తగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన సీతక్క తానే స్వయంగా శానిటైజ్ చేశారు. క్లాస్ రూమ్, స్కూల్ పరిసరాలను శానిటైజర్ బ్లీచింగ్ తో పిచికారి చేశారు ఎమ్మెల్యే సీతక్క. పరీక్షలు రాసే స్టూడెంట్స్ కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎగ్జామ్ హాల్స్ ను ప్రతిరోజూ క్లీన్ చేయాలని, విద్యార్థులకు కరోనా జాగ్రత్తలను తెలుపాలని టీచర్స్ కు తెలిపారు సీతక్క.

Latest Updates