మంచినీళ్లిచ్చుడే చేత‌కాదు..మందు మాత్రం డెలివరీ చేస్తున్నారు

ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోయిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. 72వేల కోట్లతో పార్కులు, బాత్ రూమ్ లు మాత్రమే కట్టారన్నారు. ఈ డబ్బుతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏమైనా నిర్మించారా అని ప్ర‌శ్నించారు.

మంచి నీళ్లు ఇవ్వడం లేదు కానీ… మద్యం మాత్రం డెలివరీ చేస్తున్నారన్న సీత‌క్క‌..ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరితే..కాంగ్రెస్ నాయకులకు ఉద్యోగాలు లేవని ఎగతాళి చేస్తున్నార‌ని అన్నారు. తెలంగాణ ఉద్యమం చేసింది మీ పదవులు కోసమేనా  అని ములుగు ఎమ్మెల్య సీత‌క్క ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌

రాష్ట్ర ప్రభుత్వం సమస్యలపై మాట్లాడలేక పారిపోయిందని ఎద్దేవా చేశారు సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఈ నెల 28వరకు సమావేశాలు నడుపుతామన్న కేసీఆర్… కాంగ్రెస్ కు బయపడి తోక ముడుచుకొని పారిపోయారని అన్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి పెద్ద ఎత్తున అప్పులు చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

సభ అంటే ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి ప్రజా సమస్యలపై చర్చించాలి. ఈ సమావేశాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగాయి. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగుల సమస్యను సభ దృష్టికి తీసుకువచ్చాం. రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లాం.
రూ.6లక్షల కోట్ల అప్పులు చేసే విధంగా సభ నిర్వహించారు… అప్పులు చేసేందుకు బిల్లును తెచ్చుకున్నారు. రూ.72వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ కు ఖర్చు చేశామని కేటీఆర్ చెబుతున్నాడు

రూ.72వేల కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ అతి తక్కువ ఖర్చుతో హైదరాబాద్ ను విశ్వ నగరంగా మార్చింది. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో రూ.72వేల కోట్లు ఎక్కడికీ పోయాయో ఆలోచించి ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. భూమిలేని ప్రతి దళితుడికి మూడెకరాల భూమి పంచినప్పుడే అంబేద్కర్ కు ఘనమైన నివాళి అని సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.

Latest Updates