ఆదివాసీల ఆక‌లి తీర్చేందుకు అడ‌వి బాట ప‌ట్టిన‌ ఎమ్మెల్యే

దట్టమైన అడువులు..నడుద్దామన్నా దారి లేదు.. పైకి చూస్తే భగ భగ మండే 44 డిగ్రీల ఎండ. అంత‌టి ఎండ‌లోనూ నెత్తిన 26 కేజీల కూరగాయల మూట‌తో అడ‌వి బాట ప‌ట్టారు ములుగు ఎమ్మెల్యే సీతక్క . వాగులు దాటుతూ…, కొండలు, గుట్టలు ఎక్కుతూ దిగుతూ… అడవి బిడ్డల దగ్గరకు చేరుకుని వారి ఆకలి తీర్చేందుకు శ్రమిస్తున్నారు.

కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు లాక్ డౌన్ విదించటంతో వారాంతపు సంతలు బంద్ అయ్యాయి. కోయగూడేల‌ ప్రజలకు నిత్యావసర వస్తువులు,సామాగ్రి కోనుగోలు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు.

దీంతో తన ములుగు జిల్లాలో ఉన్న నిరుపేదలు ఆకలి తో అలమటించకుండా చూసేందుకు ఎమ్మెల్యే సీతక్క ఇలా దారి లేని కోయగూడేల‌కు తానే స్వయంగా కూరగాయల మూటలు మోసుకుంటూ.. పదుల కిలోమీటర్లు నడుస్తూ ఆదివాసీల ఆకలి తీరుస్తున్నారు. 38 రోజులుగా ఆదివాసీలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.

Latest Updates