నా క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు..నేను డ్రైవర్ ను మోసం చేస్తానా : ముమైత్

రెండు రోజుల నుంచి తనపై జరుగుతున్న తప్పుడు ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ముమైత్ ఖాన్ తెలిపింది. క్యాబ్ డ్రైవర్ ను‌ చీట్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది.

పలు మీడియా సంస్థలు  తన పరువుకి భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశారు. నా క్యారెక్టర్ ను‌ జడ్జ్ చేసే అధికారం ఏముంది ఒక్కసారి ఆలోచించండి .

నామీద డ్రైవర్ తప్పుడు ఆరోపణలు చేశాడు. అతను చెప్పిన దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. అతను రాష్ డ్రైవింగ్ చేసి నన్ను భయాందోళనకు గురి చేశాడు..అతనిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ముమైత్ చెప్పింది.

నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ పోలీసులకు అందజేశాను..అతనికి 23 వేలు 500 డబ్బులు చెల్లించాను. మీడియా ఒక్క సైడ్ వర్షన్ తీసుకొని వార్తలు వేయడం నన్ను బాధించింది.

నేను 12 సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను నా క్యారెక్టర్ అందరికీ తెలుసు..టోల్గేట్ లకు సంబంధించి పూర్తి డబ్బులు నేనే కట్టాను..  గోవా కి ఫ్లైట్ లో పెట్స్ కు అనుమతి లేకపోవడంతో క్యాబ్ వెళ్లాల్సి వచ్చింది ముమైత్ ఖాన్ మీడియాకు తెలిపింది.

Latest Updates