చెప్పిన వాడిని చేసుకోలేదని.. కూతురును చంపేశాడు

mumbai-20-year-old-killed-by-father-for-refusing-marriage-proposal-868544

ఓ కర్కోటక తండ్రికి సంబంధించిన వార్త ఇది.

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని ఘట్కోపూర్ లో ఆదివారం నాడు జరిగిందీ ఇన్సిడెంట్. బిజీ రోడ్డు ఫుట్ పాత్ పై ఓ యువతి డెడ్ బాడీ కనిపించింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. 2రోజుల వ్యవధిలో షాకింగ్ వాస్తవాలు తెల్సుకున్నారు.

సబర్బన్ ముంబైలోని ఘట్కోపూర్ లో ఆమె కుటుంబం ఉంటోంది. ఆ యువతి ఓ వ్యక్తిని ప్రేమించింది. తండ్రి ఆ యువకుడిని రిజెక్ట్ చేశాడు. ఓ సంబంధం చూపించి ఆ అబ్బాయిని చేసుకోవాలని ఆదేశించాడు. ఐతే… ఆ యువతి.. 26 ఏళ్ల తన ప్రియుడినే పెళ్లిచేసుకుంది. తమ మాటను కాదని.. చెప్పినవాడిని చేసుకోలేదన్న కోపంతో.. ఆ తండ్రి తన 20 ఏళ్ల కూతురుని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ డెడ్ బాడీని అర్ధరాత్రి వేళ ఫుట్ పాత్ పై పడేసి వెళ్లిపోయాడు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. కేసు వివరాలు ఇవాళ తెలిపారు. మ్యారేజ్ ప్రపోజల్ కారణంగానే కన్నకూతురుని తండ్రి చంపేశాడని తేల్చారు. తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates