ముంబై ఉగ్రదాడి సూత్రధారికి 15 ఏళ్ల జైలు శిక్ష

ముంబై ఉగ్రదాడి సూత్రధారికి జైలు శిక్ష పడింది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందిస్తున్నాడన్న ఆరోపణలపై 61 ఏళ్ల జకీ ఉర్‌ రెహ్మాన్‌ రెహ్మాన్‌ లఖ్వికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది పాకిస్తాన్ కోర్టు. ఉగ్రవాద నిరోధక చట్టం 1997 లోని వివిధ సెక్షన్ల కింద ఈ  శిక్షను ఖరారు చేసింది. దీనికి సంబంధించి న్యాయమూర్తి ఎజాజ్ అహ్మద్ బుట్టార్  శుక్రవారం తీర్పు చెప్పారు. లఖ్వీకి మూడు కౌంట్స్‌ చొప్పున ఐదేళ్ల కఠిన  కారాగార జైలు శిక్ష విధించారు. అలాగే  లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు.  జరిమానా చెల్లించడంలో  విఫలమైతే ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

ముంబై  పేలుళ్ల  కేసులో అరెస్టైన  లఖ్వీ…2015 నుంచి బెయిల్ పైనే ఉన్నాడు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలు రావడంతో..పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన తీవ్రవాద నిరోధక విభాగం (CTD) గత వారం అరెస్ట్‌ చేసింది.

Latest Updates