10వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం

ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ జట్టుపై ఆసీస్ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 49.1 ఓవర్లలో 255పరుగులకు ఆలౌట్ కాగా, ఆతర్వాత 256 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 37.4 ఓవర్లలో 258 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ చేసిన స్కోరునంతా ఆసీస్ ఓపెనర్లు ఇద్దరే 12.2 ఓవర్లు మిగిలి ఉండగానే విజయలక్ష్యాన్ని చేరుకున్నారు. ఆసీస్ బ్యాట్స్ మెన్లు డేవిడ్ వార్నర్ 128 పరుగులు, ఆరోన్ పించ్ 110 పరుగులు చేశారు. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.

Mumbai: Australia beat India by 10 wickets.

Latest Updates