పేరుకే బిచ్చగాడు.. లక్షల్లో ఫిక్స్ డ్ డిపాజిట్

ముంబయిలో చనిపోయిన ఓ యాచకుడి దగ్గర లక్షల్లో డబ్బు గుర్తించారు పోలీసులు. ముంబయిలో అడుక్కునే బిర్జు చంద్ర ఆజాద్ అనే యాచకుడు శుక్రవారం నాడు రైలు ఢీకొని చనిపోయాడు. అతని దగ్గర ఉన్న చిల్లరను పోలీసులు లెక్కించగా… లక్షా 50వేలుగా లెక్కతేలింది. అలాగే… అతడు ఉండే ఇంట్లో తనిఖీలు చేయగా… 8 లక్షల 77వేల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లు గుర్తించారు. బిర్జు చంద్ర ఆజాద్ రాజస్థాన్ కు చెందినవాడని… అతడికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉన్నాయని పోలీసులు తెలిపారు.

అతను ఒంటరిగా నివసించేవాడని,  అతని గురించి  ఇరుగుపొరుగు వారికి ఏమీ తెలియదని సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్  వశీ జీఆర్ పీ అన్నారు. అతని ఇంట్లో దొరికిన పత్రాల ద్వారా అతన్ని గుర్తించామని, అతని కుటుంబం రాజస్థాన్‌లో నివసిస్తున్నట్లు తెలిసిందన్నారు.  ఆ యాచకుడు బ్యాంక్ లో డిపాజిట్ చేసిన సొమ్ముకు నామినీ అతని కొడుకు తెలియడంతో అతనికి కబురు పంపామని ఇన్‌స్పెక్టర్  చెప్పారు.

Latest Updates