పోలీసులకు చిక్కిన ముంబై పేలుళ్ల దోషి

  • జీవిత ఖైదు విధించడంతో జైలుకు
  • పెరోల్​పై బయటికొచ్చిన అన్సారీ.. ఆపై గాయబ్

ముంబై, కాన్పూర్: ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషి, పరారీలో ఉన్న డాక్టర్​ బాంబ్​ అలియాస్​ జలీస్​ అన్సారీ(68)ని కాన్పూర్​ పోలీసులు పట్టేసుకున్నరు. శుక్రవారం సాయంత్రం అన్సారీని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్​ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బాంబు పేలుళ్ల కేసులో కోర్టు జీవిత ఖైదు విధించడంతో అన్సారీని రాజస్థాన్​ జైలుకు తరలించారు. కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురవడంతో అన్సారీ పెరోల్​ కోసం దరఖాస్తు చేసుకున్నడు. కోర్టు ఆయనకు 21 రోజుల పెరోల్​గ్రాంట్​ చేసింది. దీంతో జైలు బయట అడుగుపెట్టిన అన్సారీ.. సొంతూరికి వెళ్లి తన కుటుంబంతో కాలం గడిపాడు. ఈ నెల 17న పెరోల్​ గడువు ముగిశాక తిరిగి రావాల్సిన అన్సారీ..  శుక్రవారం ఉదయమే ఇంట్లోంచి బయటపడ్డాడు. ఆ తర్వాత అన్సారీ ఆచూకీ తెలియడంలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్​ చేశారు. దీంతో అన్సారీ పరారీలో ఉన్నాడని ప్రకటించిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్టు వింగ్ పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు.

Latest Updates