మరుగుదొడ్లోని నీటితో ఇడ్లీ చట్నీ తయారీ

mumbai-idli-vendor-uses-toilet-water-to-cook-food-probe-ordered

వీధుల్లో ఇడ్లీ అమ్మే ఓ వ్యాపారి చట్నీ తయారీకి మరుగుదొడ్డిలోని నీటిని వాడాడు. ముంబైలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ముంబైలోని బొరివెలి రైల్వేస్టేషన్ సమీపంలో ఇడ్లీలు అమ్ముకునే ఓ వ్యక్తి.. స్టేషన్ టాయిలెట్ లో తెచ్చిన నీటితో చట్నీ తయారు చేశాడు. ఇదంతా ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి ట్విటర్ లో షేర్ చేశాడు.

ఈ వీడియో ఆహార భద్రతా అధికారుల వరకూ వెళ్లింది. దీనిపై స్పందించిన అధికారులు.. ఆహారం విషయంలో కలుషిత నీటిని ఉపయోగించిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆ వ్యక్తిని గుర్తించి, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముంబై ఎఫ్‌డీఏ అధికారి శైలేష్‌ అదావ్‌ అన్నారు.

Latest Updates