ఐపీఎల్-2019 విజేత ముంబై ఇండియన్స్

Mumbai Indians beat Chennai Super Kings by 1 run
  • పరుగు తేడాతో ఫైనల్లో విక్టరీ
  • నాలుగో టైటిల్‌ తో రికార్డు
  • ఆఖరి ఓవర్లో చెన్నై బోల్తా
  • వాట్సన్ పోరాటం వృథా

ముంబై ఇండియన్స్ మళ్లీ వండర్‌ చేసింది . ఓటమి అంచు-ల్లోం చి బయటపడి.. చేజారుతున్న మ్యాచ్‌ ను కాపాడుకొని ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌‌‌‌ను ఓడించి ఔరా అనిపించింది. నాలుగోసారి ట్రోఫీ గెలిచి ఐపీఎల్‌ లో తమదే బెస్ట్‌ టీమ్ అని ప్రపంచానికి చాటి చెప్పింది. షేన్‌‌‌‌ వాట్సన్‌‌‌‌  (59 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 80) సింగిల్‌హ్యాండ్‌ తో చెన్నైని విజయానికి చేరువ చేసినా.. ఆఖర్లో అనవసర డబుల్‌ కోసం యత్నించి రనౌటవడం చెన్నై కొంపముంచింది. ఇక్కడి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఒక్క పరుగు తేడాతో ముంబై చేతిలో ఓడిన చెన్నై త్రుటిలో టైటిల్‌ చేజార్చుకుంది. అనేక మలుపులు తిరుగుతూ ఆద్యంతం ఆసక్తిగా సాగిన మ్యాచ్‌ లో మొదట బ్యాటింగ్‌‌‌‌ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 రన్స్‌‌‌‌ చేసింది. కీరన్‌‌‌‌ పొలార్డ్‌ (25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 నాటౌట్‌ )టాప్‌ స్కోరర్‌ . ఓపెనర్‌ క్వింటన్‌‌‌‌ డికాక్‌ (17 బంతుల్లో 4ఫోర్లతో 29) రాణించాడు. చెన్నై బౌలర్లలో దీపక్‌ చహర్మూడు, శార్దు ల్‌ ఠాకూర్‌ , ఇమ్రాన్‌‌‌‌ తాహిర్‌ చెరో రెండువికెట్లు తీశారు. అనంతరం వాట్సన్‌‌‌‌ మెరుపులతో ఒక దశలో గెలుపు ముగింట నిలిచిన చెన్నై ఓవర్లన్నీ ఆడి 7వికెట్లకు 148 రన్స్ చేసి ఓడిపోయింది. బుమ్రా రెండు వికెట్లు తీయగా, రాహుల్‌ చహర్ (1/14) పొదుపుగాబౌలింగ్‌‌‌‌ చేశాడు. చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌‌‌‌ చేసిన మలింగ (1/49) ముంబై హీరో అయ్యాడు. విజేతముంబై ఇండియన్స్‌‌‌‌కు రూ.20 కోట్లు, రన్నరప్‌ చెన్నైసూపర్‌ కింగ్స్‌‌‌‌కు రూ.12.5 కోట్లు లభించాయి.

చేరువై.. దూరమై

చివరి ఐదు ఓవర్లలో చెన్నై విజయానికి 62 రన్స్‌‌‌‌ అవసరమయ్యాయి. వాట్సన్‌‌‌‌ క్రీజులో ఉండడంతో జట్టు ఆశలు కోల్పో లేదు. నమ్మకాన్ని నిలబెడుతూ వాట్సన్‌‌‌‌ ఒక్కసారిగా గేరు మార్చేశాడు. మలింగ వేసిన 16వ ఓవర్లో బ్రావో(15) అద్భుతమైన షాట్​తో సిక్సర్ కొట్టగా .. వాట్సన్‌‌‌‌ పర్ఫెక్ట్‌ టైమింగ్‌‌‌‌తో మూడు ఫోర్లు బాదాడు. ఆ ఓవర్లో 20 రన్స్‌‌‌‌ వచ్చాయి . బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లోనే వాట్సన్‌‌‌‌ ఇచ్చిన క్యాచ్‌ ను రాహుల్  నేలపాలు చేశాడు. దీనికి ముంబై భారీ మూల్యమే చెల్లించుకుంది. ఆ ఓవర్లో బుమ్రా నాలుగు రన్స్‌‌‌‌ మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్​లో ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. 18 బంతుల్లో 38 రన్స్ అవసరమవగా..క్రునాల్‌ వేసిన 18వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టిన వాట్సన్‌‌‌‌ మ్యాచ్‌ ను లాగేసుకున్నా డు.19వ ఓవర్లో రెండో బాల్‌ కే బ్రావో ఔటైనా లాస్ట్ బాల్‌ కు బై రూపంలోఫోర్ వచ్చింది.

టెన్షన్‌ .. టెన్షన్..

చివరి ఓవర్లో 9 రన్స్‌‌‌‌ చేస్తే చెన్నైదే విజయం. బ్యాటుతోవాట్సన్‌‌‌‌.. బంతితో మలింగ. తొలి రెండు బంతులకు రెండు సింగిల్స్ వస్తే, మూడో బాల్‌ కు వాట్సన్‌‌‌‌ డబుల్తీశాడు. నాలుగో బాల్‌ ను డీప్ పాయింట్ వైపు ఆడిన వాట్సన్‌‌‌‌ డబుల్‌ తీసే క్రమంలో రనౌటయ్యాడు. రెండు బంతుల్లో 4 రన్స్‌‌‌‌ కావాలి. ఐదో బాల్‌ కు శార్దుల్ ఠాకూర్(2) డబుల్ తీయడంతో చివరి బంతికి రెండు రన్స్ అవసరం అయ్యాయి. కానీ, మలింగ యార్కర్‌ తో శార్దుల్‌ ను ఎల్బీగా ఔట్ చేసి చెన్నైని ఓడించాడు.

వాట్సన్‌ ఒక్కడే

చిన్న టార్గెట్‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో చెన్నైకి మెరుపు ఆరంభం దక్కి నాఅదే జోరును కొనసాగించలేకపోయింది. వాట్సన్‌‌‌‌‌‌‌‌ కాస్త నిదానంగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేయగా మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌ (13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌ తో 26) ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మూడో బంతి నే బౌండ్రీకి చేర్చి ఖాతా తెరిచిన అతను క్రునాల్‌ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా 4,6,4తో రెచ్చి పోయాడు. కానీ, అదే ఊపులో క్రీజు ముందుకొచ్చి మరో షాట్‌ ఆడే ప్రయత్నంలో స్టంపౌటయ్యాడు. అయితే, అప్పటిదాకా జాగ్రత్తగా ఆడిన వాట్సన్‌‌‌‌‌‌‌‌.. మలింగ బౌలింగ్‌‌‌‌‌‌‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌ తో వేగం పెంచడంతో పవర్‌ ప్లే ముగిసే టైమ్‌‌‌‌‌‌‌కు చెన్నై 53/1తోమెరుగైన స్థితిలో నిలిచింది. కానీ, ముంబై బౌలర్లు ఒక్కసారిగా జోరు చూపారు. తర్వాతి ఐదు ఓవర్లలో మూడు వికెట్లు తీసి 73/3తో చెన్నైని ఆత్మరక్షణలోకి నెట్టారు. మలింగ క్యాచ్‌ వదిలేయడంతో 6 రన్స్‌‌‌‌‌‌‌‌ వద్దే ఔటయ్యేప్రమాదం తప్పించుకున్న రైనా (8) పదో ఓవర్లో రాహుల్చహర్‌ కు వికెట్ల ముందు దొరికిపోయాడు. బుమ్రా వేసినతర్వాతి ఓవర్లో నే లోకల్‌ స్టా ర్‌ అంబటి రాయుడు (1)కీపర్‌ కు క్ యాచ్‌ ఇచ్చి నిరాశ పరిచాడు. ఈ దశలో వాట్స-న్‌‌‌‌‌‌‌‌కు జతకలిసిన ధోనీ నిం పాదిగా ఆడడంతో రన్‌‌‌‌‌‌‌‌రే ట్‌ పడి-పోయింది. 8 బంతుల్లో 2 రన్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే చేసిన మహీ..13వ ఓవర్లో డబుల్‌ తీసే ప్రయత్నంలో ఇషాన్‌‌‌‌‌‌‌‌ విసిరినమెరుపు త్రోకు రనౌటయ్యాడు.

స్కోర్‌ బోర్డ్‌

ముంబై: డికాక్‌ (సి) ధోనీ (బి) శార్దూల్‌ 29, రోహిత్ (సి) ధోనీ (బి) దీపక్‌ 15,సూర్యకుమా ర్‌ (బి) తాహిర్ 15, ఇషాన్‌‌‌‌‌‌‌‌ (సి) రైనా (బి) తాహిర్‌ 23, క్రునాల్‌ (సిఅండ్‌ బి) శార్దూల్‌ 7,పొలార్డ్‌ (నాటౌట్‌ ) 41, హార్ది క్‌ (ఎల్బీ) దీపక్‌ 16, రాహుల్‌(సి) డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌ (బి) దీపక్‌ 0, మెక్లెనగన్‌‌‌‌‌‌‌‌ (రనౌట్‌ ) 0, బుమ్రా (నాటౌట్‌ ) 0; ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా-లు: 3; మొత్తం: 20 ఓవర్లలో 149/8;

వికెట్ల పతనం: 1–45, 2–45, 3–82,4–89, 5–101, 6–140, 7–140, 8–141; బౌలిం గ్‌ : దీపక్‌ 4–1–26–3,శార్దుల్‌ 4–0–37–2, హర్భజన్‌‌‌‌‌‌‌‌ 4–0–27–0, బ్రావో 3–0–24–0, తాహిర్‌3–0–23–2, జడేజా 2–0–12–0.

చెన్నై సూపర్‌ కింగ్స్‌‌‌‌‌‌‌‌ : డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌ (స్టంప్ డ్‌ ) డికాక్‌ (బి) క్రునాల్‌ 26, వాట్సన్‌‌‌‌‌‌‌‌ (రనౌట్)80, రైనా (ఎల్బీ) రాహుల్‌ 8, రాయుడు (సి) డికాక్‌ (బి) బుమ్రా 1, ధోనీ (రనౌట్‌ )2, బ్రావో (సి) డికాక్​ (బి) బుమ్రా15, జడేజా (నాటౌట్‌ )5, శార్దూల్​(ఎల్బీ)మలింగ2; ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రాలు : 9; మొత్తం : 20 ఓవర్లలో 148/7;

వికెట్ల పతనం :1–33, 2–70 , 3–73, 4–82,5–133, 6–146, 7–148; బౌలిం గ్‌ :మెక్లెన్‌‌‌‌‌‌‌‌గన్‌‌‌‌‌‌‌‌ -4–0–24–0, క్రునాల్‌ 3–0–39–1,మలిం గ 4–0–49–1 , బుమ్రా4–0–14–2, రాహుల్‌ 4–0–14–1, హార్దిక్​ 1–0–3–0.