కోల్ కతాను కట్టడి చేసిన ముంబై

ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు ముంబై బౌలర్లు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. కోల్ కతా స్టాటింగ్ లో దూకుడుగా ఆడింది. పవర్ ప్లే ముగిసాకా ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో స్కోరు బోర్డు వేగం తగ్గింది. లిన్ 41, రాబిన్ ఊతప్ప 40 పరుగులు మినహా కోల్ కతా బ్యాట్స్ మెన్ ఎవరూ సరిగా రాణించలేకపోయారు. ఆఖర్లో నితీష్ రాణా 13 బంతుల్లో 3 సిక్సులతో 26 పరుగులు చేయడంతో ముంబైకి 134 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ముంబై బౌలర్లలో మలింగకు 3,హార్థిక్ పాండ్యా,బుమ్రాకు తలో రెండు వికెట్లు పడ్డాయి.

 

Latest Updates