అతిగా సినిమాలు చూస్తుందని భార్యను చంపేశాడు

mumbai-man-kills-his-wife-over-addiction-of-watching-movies

రాత్రంతా సినిమాలు చూస్తోందన్న కారణంతో ఓ భర్త తన భార్యను చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అంధేరిలో జరిగింది. అంధేరికి చెందిన చేతన్‌ చౌఘులే(32), తన భార్య ఆర్తి(22)ల మధ్య  సినిమాల విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇలా గొడవైన ప్రతీ సారి తన రెండేళ్ల బాబును తీసుకొని ఆర్తి పుట్టింటికి వెళ్లేది. కొన్నాళ్లకు తిరిగొచ్చిన తర్వాత కూడా అదే తీరు.

ఈ క్రమంలో ఈ నెల 10 వ తేదిన .. ఇంటి సరుకుల కోసమని ఆర్తి తన భర్తను డబ్బులు అడిగింది. కొన్ని కారణాలు అతను డబ్బును ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

ఆ రోజు రాత్రి భర్తపై అలిగిన ఆర్తి..  రాత్రంతా యూట్యూబ్‌లో సినిమాలు చూసింది. సౌండ్ ఎక్కువగా పెట్టడంతో నిద్ర పట్టని చేతన్.. విసిగిపోయి తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె గొంతును నులిమి చంపేశాడు. ఆ తర్వాత గురువారం ఉదయం పోలీసు స్టేషన్‌కు వెళ్లి  జరిగినదంతా చెప్పి పోలీసుల ముందు లొంగిపోయాడు. వీరిద్దరి విపరీత ధోరణితో రెండేళ్ల బాబు అనాథయ్యాడు.

Latest Updates