ముంబైలో జరిగే టీ20కి సెక్యూరిటీ కల్పించలేం

డిసెంబర్ 6 న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా వెస్టిండీస్ టీ20కి సెక్యూరిటీ కల్పించలేమని ముంబై పోలీసులు ముంబై క్రికెట్ అసోసియేషన్ కు చెప్పారు. అదే రోజులు బాబా సాహెబ్ అంబేద్కర్ పరినిర్వన్ దివాస్ , ఇతర కార్యక్రమాలు ఉన్నందున భద్రత కల్పించలేమని చెప్పింది.  

డిసెంబర్ లో వెస్టీండీస్ ఇండియాతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. మొదటి టీ20 డిసెంబర్6 వాంఖడే స్టేడియంలో జరగనుంది.  డిసెంబర్ 8 రెండవ టీ20, 11న మూడో టీ20 జరగనుంది. డిసెంబర్ 15 మొదటి వన్డే, 18న రెండో వన్డే, 22న మూడో వన్డే జరగనుంది.

Latest Updates