ఇళ్లలోనే ఉండండి.. ఇర్ఫాన్ ఖాన్ సినిమాలు చూడండి

ముంబై పోలీసుల ట్వీట్
న్యూఢిల్లీ: విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు ముంబై పోలీసులు నివాళి అర్పించారు. ఓ ముఖ్యమైన సందేశంతో పోలీసులు నివాళి అర్పించడం విశేషంగా చెప్పుకోవాలి. ‘ఇర్ఫాన్ ఖాన్ ను గుర్తు చేసుకుందాం. అందరి జ్ఞాపకాల్లో నిన్ను పదిలంగా ఉంచుకోవడానికి ప్రపంచానికి ఎన్నో మార్గాలను నువ్వు ఇచ్చావ్’ అని ఇర్ఫాన్ ను ఉద్దేశించి ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. కాలయాపన చేయకుండా ప్రజలు తమ ఇళ్ల వద్దే ఉంటూ ఇర్ఫాన్ ఖాన్ సినిమాలు చూడాలని అర్థం వచ్చేలా రూపొందించిన ఒక మీమ్ ను ట్వీట్ కు జత చేశారు. బుధవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతూ ఇర్ఫాన్ చనిపోయిన విషయం తెలిసిందే. గురువారం మరో సినీ దిగ్గజం రిషి కపూర్ (67) కూడా మృతి చెందారు. దీంతో సినీ ప్రముఖులు, ప్రేక్షకులు శోక సంద్రంలో మునిగిపోయారు.

Latest Updates