అమ్మకు ఏం ఇష్టమో తెలుసా?.. ముంబై పోలీసుల ట్వీట్

Mumbai Police picks Amitabh Bachchan’s Agneepath scene to share a message

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతోంది. ఆ స్టేట్‌‌లో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో లాక్‌‌డౌన్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు దీనిపై అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ముంబై పోలీసులు భావించారు. సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో ముందుండే ముంబై పోలీసులు.. కరోనా పై కూడా తమ వంతు బాధ్యతగా జనాలను అలర్ట్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఓ మీమ్‌‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

బాలీవుడ్ బిగ‌్‌‌బీ అమితాబ్ బచ్చన్ నటించగా.. 1990లో విడుదలై సూపర్ హిట్ కొట్టిన అగ్నిపథ్‌‌లోని ఓ సీన్‌‌ను తీసుకొని ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. ఈ సీన్‌‌లో ప్రముఖ నటి రోహిణి హట్టంగడి, నీలం కొఠారీ కూడా ఉన్నారు. ‘అమ్మకు ఏం ఇష్టమో తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా?’ అంటూ ఈ వీడియోలో అమితాబ్‌‌ను రోహిణి ప్రశ్నించాడ్ని చూడొచ్చు. చేతులను కడుక్కో, శుభ్రం చేసుకో అంటూ అమితాబ్‌‌ను అమ్మ పాత్రలో నటించిన రోహిణి ఆదేశిస్తుంది. కరోనా టైమ్‌‌లో హ్యాండ్ శానిటైజేషన్ ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేయడానికే పోలీసులు ఈ మీమ్‌‌ను రూపొందించారని చెప్పొచ్చు. ఈ మీమ్‌‌పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. పోలీసుల క్రియేటివీటీ సూపర్బ్ అని, మీమ్‌‌తోపాటు మెసేజ్ కూడా బాగుందని, అమ్మెప్పుడూ కరెక్టే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mumbai Police (@mumbaipolice)

Latest Updates