మీమ్స్‌తో అవగాహన కల్పిస్తున్న ముంబై పోలీసులు

  • ట్విట్టర్‌‌లో గల్లిబాయ్‌ సినిమా మీమ్‌ పోస్ట్

ముంబై: మహారాష్ట్ర ముంబై పోలీసులు కరోనాను అరికట్టేందుకు, ప్రజలు లాక్‌డౌన్‌ను పాటించేందుకు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. సోషల్‌ మీడియాలోని మీమ్స్‌ను షేర్‌‌ చేస్తూ వాటికి తమదైన రీతిలో క్యాప్షన్స్‌ ఇస్తున్నారు. బాలీవుడ్‌ నటులు రణబీర్‌‌ సింగ్‌, అలియా భట్‌ నటించిన ‘గల్లీ బాయ్‌’ సినిమాలోని ఒక పోస్టర్‌‌ను షేర్‌‌ చేశారు. అలియా భట్‌ నవ్వుతూ ఉన్న ఫొటోపై “ లాక్‌డౌన్‌ టైంలో అతను వాక్‌ వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు ఆమె ఎక్స్‌ప్రెషన్‌” అని క్రియేట్‌ చేసిన మీమ్‌ను వెరైటీ క్యాప్షన్‌తో ట్విట్టర్‌‌లో షేర్‌‌ చేశారు. “ అబార్ట్‌ మిషన్‌.. వ్యూ రిపీట్‌ అబార్ట్‌ మిషన్‌ స్టే హోమ్‌, స్టే సేఫ్‌” అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు. ఇదే కాకుండా ముంబై పోలీసులు గతంలో కూడా చాలా సినిమా రిఫరెన్స్‌ పోస్ట్‌లు పెట్టారు. 2018లో రిలీజైన శ్రద్ధా కపూర్‌‌ ‘స్త్రీ’ సినిమాలోని పోస్టర్‌‌ను రిఫర్‌‌ చేస్తూ “ కరోనా మళ్లీ తిరిగి రాకు”అనే మెసేజ్‌ను పోస్ట్‌ చేశారు. బాలీవుడ్‌ హిరో అజయ్‌ దేవగణ్‌ పోలీసులను పొగుడుతూ వీడియో పెట్టగా.. దానికి ముంబై పోలీసులు ఆయన సినిమాలు అన్నీ వచ్చేలా థ్యాంక్స్‌ చెప్పారు. “ డియన్‌ ‘సింగం’, ‘ఖాకీ’లు ఏం చేయాలో అదే చేస్తున్నాం. కచ్చితంగా ‘వన్స్‌ అప్‌ ఆన్‌ ఏ టైం ఇన్‌ ముంబై”ను తిరిగి తెచ్చేలా కృషి చేస్తున్నాం” అని రిప్లై ఇచ్చారు. మన దేశంలోని అన్ని రాష్ట్రల్లో కల్లా కరోనా పాజిటివ్‌ కేసులు మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో అక్కడ వ్యాధిని అరికట్టేందుకు, ప్రజలు లాక్‌డౌన్‌ పాటించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. డ్రోన్‌ టెక్నాలజీ వాడి నిఘా చేపట్టారు.

Latest Updates