ముంబై వర్సెస్ చెన్నై గ్రాండ్​ ఓపెనింగ్ షో

ఐపీఎల్​ను సూపర్​ హిట్​ చేయాలంటే.. ఓపెనింగ్​ షో కూడా అదే స్థాయిలో ఉండాలి. అందుకే ముంబై, చెన్నై మధ్య తొలి మ్యాచ్​తో​ గ్రాండ్​ ఓపెనింగ్​కు సర్వం సిద్ధమైంది. కరోనాతో ఉక్కిరిబిక్కిరి అయిన సీఎస్​కే.. ఇన్​టైమ్​లో కోలుకుని మళ్లీ బరిలోకి దిగుతుండటం శుభపరిణామం. దీనికితోడు ధోనీ ఆట కోసం కోట్లాది మంది ఫ్యాన్స్​ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి గ్రాండ్​ ఓపెనింగ్​ షో సూపర్​ సక్సెస్​ అవుతుందని నిర్వాహకుల నమ్మకం. ఇక ఇరుజట్లను ఓసారి పరిశీలిస్తే.. ఈ మ్యాచ్​లో ముంబై ఫేవరెట్​. స్లో స్టార్టర్​ అని పేరున్నా.. పేపర్​ మీద చూస్తే చాలా బలమైన జట్టు వాళ్ల సొంతం. ఐపీఎల్​ కోసం అద్భుతమైన ప్లాన్స్​తో సిద్ధమైన టీమ్​ ముంబై. ప్రత్యర్థులను వణికించే రోహిత్​, డికాక్​, సూర్యకుమార్​ యాదవ్​, హార్దిక్​, క్రునాల్​, పొలార్డ్​తో కూడిన పటిష్టమైన బ్యాటింగ్​ లైనప్​ ఉంది. ట్రెంట్​ బౌల్ట్, కూల్టర్​నీల్​ కూడా చెయ్యేస్తే తిరుగుండదు. డెత్​ బౌలింగ్​ కింగ్​ బుమ్రా ముంబైకి అతిపెద్ద బలం.

మరోవైపు సీఎస్​కే కోర్​ టీమ్​ బాగానే ఉన్నా.. రైనా లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. రైనా ప్లేస్​లో ఆడించాలనుకుంటున్న రుతురాజ్​ గైక్వాడ్​ ఇంకా కొవిడ్​ నుంచి కోలుకోలేదు. అయితే వాట్సన్​, రాయుడు, కేదార్​, జడేజా, బ్రావో.. హోప్​లెస్​ పరిస్థితుల్లోనూ మ్యాచ్​లను గెలిపించగలరు. ఇప్పుడు కూడా వారి నుంచి అదే కోరుకుంటున్నారు. అయితే వీళ్ల ఎక్స్​పీరియెన్స్ సీఎస్​కేకు అతిపెద్ద వరం. మిచెల్​ శాంట్నర్​, లుంగి ఎంగిడి ఫారిన్​ కోటాను కంప్లీట్​ చేస్తారు. ఒకవేళ సామ్​ కరన్​ అందుబాటులోకి వస్తే ​ హిట్టింగ్​ బలం పెరుగుతుంది. హేజిల్​వుడ్​ కూడా బరిలోకి దిగితే బౌలింగ్​ బలం రెట్టింపవుతుంది. వీళ్లందరికంటే వికెట్ల వెనుకాల మహేంద్రుడు ఉన్నాడనే సంగతి ముంబైకి బాగా తెలుసు.

 

Latest Updates