ముంబైలో ట్రాఫిక్ పోలీసును చితకబాదిన మహిళ

ముంబైలో ట్రాఫిక్ పోలీసును చితకబాదింది ఓ మహిళ. పోలీసు గల్లా పట్టుకుని.. మరీ కొట్టింది. మహిళ దాడితో పోలీసు కూడా షాక్ అయ్యాడు. పోలీసు ఉన్నతాధికారులు, ఇతర వాహనదారులు చెప్పినా మహిళ వినలేదు. వరుసపెట్టి కొడుతూనే ఉంది. రోడ్డుపై వెళ్తున్న తమను ట్రాఫిక్ పోలీసు తిట్టాడని ఆమె ఆరోపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి దాడి చేసిన మహిళతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Latest Updates