బెంగళూరుపై ముంబై ఉత్కంఠ విజయం

విరాట్‌ వికెట్‌ తీయనిదే తనను వరల్డ్‌‌ బెస్ట్‌‌ బౌలర్‌ అనడం తగదని.. ఇప్పుడా సమయం వచ్చింది చీకు భయ్యా రెడీ అయిపో అని బుమ్రా సవాల్‌ విసిరితే.. అచ్ఛా నా తోనే పరాచికాలా గ్రౌండ్‌ లోకిరా చూసుకుందామని కోహ్లీ జవాబిస్తాడు. ఐపీఎల్‌ సీజన్‌‌ ప్రారంభానికి ముందు ప్రచారం కోసం రూపొందించిన వాణిజ్య ప్రకటన లోది ఈ దృశ్యం. గురువారం నాటి మ్యాచ్‌ లో కూడా అచ్చం ఇలాగే వచ్చి రాగానే బుమ్రా బౌలింగ్‌ పై విరుచుకు పడిన విరాట్‌ వరుస బౌండ్రీలతో అదరగొడితే..చివరికి అతడి వికెట్‌ తీసిన బుమ్రా లెక్క సరిచేశాడు. ఆరంభ మ్యాచ్‌ ల్లో ఓడిన రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య మ్యాచ్‌ ఊహించి నట్లే రంజుగా సాగింది. కోహ్లీ కి తోడు మిస్టర్‌ 360 డివిలియర్స్‌ మెరుపులు మెరిపించినా .. రోహిత్‌ సేన విధించిన టార్గెట్‌ కు కొద్ది దూరంలోనే నిలిచిపోయింది.

టీమిండియా కెప్టెన్‌‌‌‌, వైస్‌ కెప్టెన్‌‌‌‌ల మధ్య జరిగిన రసవత్తర పోరులో వైస్‌ కెప్టెన్‌‌‌‌దే పైచేయి అయింది.గురువారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలోజరిగిన మ్యాచ్‌ లో రాయల్​ చాలెంజర్స్‌ బెంగళూరుపై ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 రన్స్‌చేసింది. టాపార్డర్‌ లో కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ (33బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌ తో 48), సూర్య కుమార్‌యాదవ్‌‌‌‌ (24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌ తో 38)రాణిస్తే.. చివర్లో హార్దిక్‌‌‌‌ పాండ్యా (14 బంతుల్లో 2ఫోర్లు 3 సిక్సర్లతో 32 నాటౌట్‌‌‌‌) తనదైన శైలిలోఇన్నింగ్స్‌ కు ఎండ్‌ కార్డ్‌‌‌‌ వేశాడు. బెంగళూరుబౌలర్లలో చహల్‌ (4/38) ఆకట్టు కున్నాడు.అనంతరం భారీ టార్ గెట్‌‌‌‌ ఛేజింగ్‌ లో డివిలియర్స్‌ (41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్‌ లతో 70)సూపర్‌ ఇన్నింగ్స్‌ కు తోడు విరాట్‌‌‌‌ కోహ్లీ (32బంతుల్లో 6 ఫోర్లతో 46), పార్థివ్‌‌‌‌ (22 బంతుల్లో4 ఫోర్లు సిక్సర్‌ తో 31) చెలరేగడంతో లక్ష్యాని కిచాలా దగ్గరగా వచ్చిన బెంగళూరు చివరకు 20ఓవర్లలో 5 వికెట్లకు 181 రన్స్‌ వద్దే నిలిచిపోయింది. బుమ్రాకు మ్యాన్ ఆఫ్​ ద మ్యాచ్​ దక్కింది. అదరగొట్టిన యువరాజ్‌ , హార్దిక్‌సీజన్‌‌‌‌ తొలి మ్యాచ్‌ లో భారీ టార్ గెట్‌‌‌‌ ఛేజ్‌చేయలేక చతికిలపడిన ముంబై రెండో మ్యాచ్‌ లో జూలు విదిల్చింది.

టాపార్డర్‌ లో రోహిత్‌‌‌ ‌,సూర్య కుమార్‌ మెరుపులకు లాస్ట్‌‌‌‌లో పాండ్యా పిడుగులు తోడవడంతో భారీ స్కోరు చేయగలిగింది. ఓపెనర్లు రోహిత్‌‌‌‌, డికాక్‌‌‌‌ (20 బంతుల్లో2 ఫోర్లు సిక్సర్‌ తో 23) తొలి వికెట్‌‌‌‌కు 54 రన్స్‌ జోడించి ముంబైకి శుభారంభం అందించారు. ఏడో ఓవర్‌ లో డికాక్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసిన చహల్‌ బెంగళూరుకు తొలి వికెట్‌‌‌‌ అందించాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ తో కలిసి ఇన్నింగ్స్‌ ను ముందుకు నడిపిం చిన హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ హాఫ్‌ సెంచరీకి 2 రన్స్‌దూరంలో ఉమేశ్‌ బౌలింగ్‌ లో ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకొచ్చిన వెటరన్‌‌‌‌ యువరాజ్‌సింగ్‌ (12 బంతుల్లో 3 సిక్సర్లతో 23) చహల్‌ ను లక్ష్యంగా చేసుకొని చెలరేగిపోయాడు. తనలోని మునుపటి హిట్టర్‌ ను గుర్తుకుచేస్తూ.. హ్యాట్రిక్‌‌‌‌ సిక్సర్‌ లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 14వఓవర్‌ తొలి మూడు బంతులను యువీ స్టాండ్స్‌ లోకి పంపాడు. అందులో బౌలర్‌ తలమీదుగా బాదిన రెండో సిక్సర్‌ మ్యాచ్‌ కే హైలైట్‌‌‌‌. ఇదే ఊపులో నాలుగో బంతికి కూడా భారీషాట్‌‌‌‌కు యత్నించిన యువీ బౌండరీలైన్‌‌‌‌ వద్ద సిరాజ్‌ కు చిక్కాడు. ఈ దశలో బెంగళూరు బౌలర్లు కట్టు దిట్టమైనబంతులతో మిడిలార్డర్‌ ను కుప్పకూల్చారు.

చహల్‌ ఒకే ఓవర్‌ లో సూర్యకుమార్‌ , పొలార్డ్‌‌‌‌ (5)ను పెవిలి యన్‌‌‌‌ పంపాడు.ఆ వెంటనే భారీ షాట్‌‌‌‌కు యత్నించిన క్రునాల్‌ (1) బౌండ్రీ వద్ద నవదీప్‌ సైనీ అందుకున్న కళ్లు చెదిరే క్యాచ్‌ కు పెవిలియన్‌‌‌‌కు చేరగా.. మెక్లెనగన్‌‌‌‌ (1)ను సిరాజ్‌ ఔట్‌‌‌‌చేశాడు. దీంతో 142/3తో పటిష్టంగాకనిపించిన రోహిత్‌‌‌‌ గ్యాంగ్‌ 5 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి 147/7తోతక్కువ స్కోరు కే పరిమితమయ్యేలా కనిపిం చింది. చివర్లో హార్దిక్‌‌‌‌ పాండ్యా భారీ షాట్లతో విరుచుకుపడి స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. కుంగ్‌ ఫూ పాండ్యా కొట్టిన చివరి ఓవర్‌ ఐదో బంతి స్టేడియం బయట పడటం విశేషం. అతని ధాటికి చివరి రెండు ఓవర్లలో ముంబై 30పరుగులు పిండుకుంది. బెంగళూరు బౌలర్లలోఉమేశ్‌ , చహల్‌ కు చెరో 2 వికెట్లుదక్కాయి .

Latest Updates