సోనూసూద్ పై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంచలన కామెంట్స్

సోనూసూద్. మనదేశంలో ఎక్కడకు వెళ్లినా పరిచయం అక్కరలేని పేరు. కరోనా లాక్ డౌన్ సమయంలో తన సేవలతో దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందితో ‘‘రియల్ హీరో‘‘ గా నీరాజనాలు అందుకుంటున్న నటుడు సోనూసూద్ పై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంచలన కామెంట్స్ చేసింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భవనాలు కడుతూ పన్నులు ఎగవేసే ప్రయత్నం చేస్తున్నాడంటూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆరోపణలు చేసింది. తన ఇంటిని హోటల్ గా మార్చి లాభాలు గడించాలని చూస్తున్నాడని.. ఇప్పటికే కొంత మేర నిర్మాణాలు కూల్చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని బీఎంసీ చెబుతోంది. లైసన్స్ తోపాటు.. ఇతర అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు మొదలుపెట్టారని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏకంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ముంబైలోనూ జుహూ ప్రాంతంలో సోనూసూద్ నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. శక్తిసాగర్ పేరు పెట్టుకున్న తన ఆరంతస్తుల ఇంటిని హోటల్ గా మార్చారంటూ బీఎంసీ అధికారులు సోనూసూద్ కు నోటీసులు ఇచ్చారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండానే తన ఇంటిని హోటల్ గా మార్చి డబ్బులు సంపాదించాలని చూస్తున్నాడని.. తాము నోటీసులు పంపినా స్పందించలేదంటున్నారు. మరోవైపు తాను అన్ని అనుమతులు తీసుకున్నానంటూ సోనూసూద్ కోర్టును ఆశ్రయించాడు. దిగువ కోర్టు సోనూసూద్ అభ్యర్థనను తిరస్కరించడంతో హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయమని కోర్టు ఆదేశించగా.. బీఎంసీ అధికారులు సోనూసూద్ పై సంచలన ఆరోపణలు చేసింది. నేరాలకు అలవాటు పడిన వ్యక్తి అని సంబోధిస్తూ అఫిడవిట్ లో కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది అభాగ్యులను ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ కరోనా అందరూ ఇతరుల వద్దకు వెళ్లడానికే భయంతో వణికిపోయిన సమయంలో కరోనా పాజిటివ్ సోకిన వారికి,  పేషెంట్ల కోసం తన హోటల్ నే క్వారెంటైన్ సెంటర్ గా మార్చేసిన వైనం రకరకాల కథలుగా అందరూ విన్నారు. సోషల్ మీడియాలో చూసి లైకులతో హోరెత్తించారు. అందరితో షేర్ చేశారు. ముఖ్యంగా వలస కార్మికుల ఆకలి తీర్చి వారు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు బస్సులు, రైళ్లు, చివరకు విమానాలు కూడా సమకూర్చిన ఘటనలపై టీవీల్లో, పేపర్లలోనే కాదు సోషల్ మీడియాలో.. చివరకు ఎక్కడకు వెళ్లినా.. ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉన్నాయి. సోనూసూద్ ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా.. కరోనా లాక్ డౌన్ లో ఆయన చేసిన సేవలు… ఇప్పటికీ కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా మొత్తం మీడియాలోనే కాదు  సోషల్ మీడియాలోనూ.. ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఇలాంటి పరిస్థితుల్లో సోనూ సూద్ పై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ లో చేసిన ఆరోపణలపై నెటిజన్లు ఫైర్ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడిపైనే నిందలు వేసేందుకు బరితెగించిన ఈ అధికారులు పాపాత్ములు..  నీచులైన వీరిని క్షమించకూడదంటూ.. తీవ్రపదజాలంతో మండిపడుతున్నారు.

ఇవీ చదవండి

విమానాల్లో తిరిగే ప్రముఖులే ఆ సింగర్ టార్గెట్.. తర్వాత ఏం చేస్తుందంటే

వాట్సప్ కొత్త పాలసీతో ఊపందుకున్నసిగ్నల్, టెలిగ్రామ్

బ్రౌన్‌ రైస్‌.. వైట్‌రైస్‌ ఏది మంచిది?

పాస్‌వర్డ్ మర్చిపోయిండు.. గుర్తురాకపోతే రూ.1,600 కోట్లు హుష్

Latest Updates