రూమర్లు ఆపండి.. ముంతాజ్ బతికే ఉన్నారు

ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ ముంతాజ్ చనిపోయారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వారి కుటుంబసభ్యలు ఆమె బతికే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె లండన్ లో ఉన్నట్టు తెలిపారు. అయితే.. కోమల్ నాహ్తా అనే సినీ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్..  ముంతాజ్ హార్ట్ ఎటాక్ తో ముంబై హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ చనిపోయారని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఈ వార్త బాలీవుడ్ సర్కిల్లలో దావానంలా వ్యాపించింది.

ముంతాజ్ చనిపోయారన్న వార్తలపై స్పంధించిన బాలీవుడ్ దర్శకుడు మిలాప్ జువేరీ.. ఈ వార్తలన్నీ అబద్ధం అని తెలిపారు. ముంతాజ్ బతికే ఉన్నారని ఇప్పుడే తాను మాట్లాడానని చెప్పారు. ముంతాజ్ చిన్న కూతురు తాన్యా కూడా తన ఇన్ స్టా గ్రామ్ లో వీడియో పోస్ట్ చేశారు. తన తల్లి మరణం పై వచ్చిన వార్త అబద్ధం అని తెలిపారు. ఇప్పటికీ ముంతాజ్ ఆరోగ్యంగా ఉన్నారని.. తన అభిమానులను అడిగినట్టు చెప్పమన్నారని తాన్య వీడియో లో చెప్పింది.

ముంతాజ్ చనిపోయారని తప్పుగా చెప్పినందుకు క్షమించాలని కోరారు కోమల్ నాహ్తా. దేవుడి దయ వల్ల ఆమె ఆరోగ్యంగా ఉన్నరని  చెప్పారు.

1947లో జన్మించిన ముంతాజ్ బాలనటిగా సినిమాల్లోకి వచ్చారు. కెరీర్ మొదట సపోర్టింగ్ రోల్స్ వేసిన ఆమె.. ఆ తరువాత హీరోయిన్ గా చేశారు. 70వ దశకంలో బాలీవుడ్ గొప్ప డ్యాన్సర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. 1970లో బిజినెస్ మ్యాన్ మయూర్ మంధ్వానిని పెండ్లి చేసుకున్నారు. ఆమెకు ఇద్ధరు ఆడబిడ్డలు.

Latest Updates