బెంగళూరులో మున్సిపల్ వార్డు తాత్కాలికంగా సీల్

10 మందికి కరోనా పాజిటివ్
అప్రమత్తమైన అధికారులు
బెంగళూరు: కరోనా రక్కసి నగరాల్లోని మురికివాడల్లో తన ప్రభావం చూపిస్తోంది. చిన్నా చితకా పనులు చేసుకుంటూ, ఇరుకు ఇళ్లల్లో బతుకీడ్చే పేద కార్మికులపై మహమ్మారి పంజా విసురుతోంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో బెంగళూరులోని ఓ మున్సిపల్ వార్డును ప్రభుత్వం తాత్కాలికంగా సీల్ చేసింది. హొంగసంద్ర అనే వార్డులో 10 మందికి కరోనా పాజిటివ్ గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ 1,000 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది కార్మికులు బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్టులో పని చేస్తున్నారు. హొంగసంద్రలో ఉంటున్న ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించామని కర్నాటక మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ కె.సుధాకర్ తెలిపారు. ఏషియాలోనే అతి పెద్ద మురికివాడ ధారావిపై కూడా కరోనా తన ప్రభావాన్ని తీవ్రంగా చూపుతోంది. అక్కడ మూడు వారాల్లోనే 200 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 13 మంది చనిపోయారు. ఎక్కువ మంది జన సమూహాలు ఉండే మురికి వాడల్లో కరోనా త్వరగా వ్యాప్తి అయ్యే ప్రమాదం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు.

Latest Updates