ప్రారంభమైన మున్సిపల్ పోలింగ్

మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఎన్నికల విధుల్లో 55 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. 2647 వార్డులు, 324 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. మున్సిపాలిటీల్లో 11,179 మంది పోటీకి దిగారు. కార్పొరేషన్లలో 1747 మంది పోటికి దిగారు. 9 కార్పొరేషన్లలో 385 వార్డులకు 1586 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.120 మున్సిపాలిటీల్లోని 2727 వార్డులకు 6385 పోలింగ్ కేంద్రాలు సిద్దం చేశారు. మున్సిపల్, కార్పొరేషన్లలో మొత్తంగా 53.36 లక్షల మంది ఓటేయనున్నారు.

Latest Updates