అప్పుడే ఎలా తెరుస్తారని కౌంటింగ్ సెంటర్ దగ్గర గొడవ

రంగారెడ్డి జిల్లా : అభ్యర్థులు రాకముందే స్ట్రాంగ్ రూమ్ తెరిచారంటూ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ సంఘటన శనివారం ఉదయం 7 గంటలకు రంగారెడ్డి జిల్లా నాదర్ గుల్ MVSR కౌంటింగ్ సెంటర్ దగ్గర జరిగింది. క్యాండిడేట్లు రాకముందే స్ట్రాంగ్ రూమ్ ఎలా తెరుస్తారని ఎన్నికల అధికారులపై గొడవకు దిగారు.

ఉదయం 8 గంటలు కాకముందే కౌంటింగ్ కోసం ఎలా వస్తారని సీరియస్ అయ్యారు కాంగ్రెస్, బీజేపీ పార్టీల కార్యకర్తలు. కౌంటింగ్ సెంటర్ల దగ్గర పోలీసులు అలెర్ట్ గా ఉండాలని తెలిపారు.  పోలీసులు వచ్చి  నచ్చజెప్పడంతో అక్కడి నుండి వెళ్లి పోయారు కార్యకర్తులు.

SEE ALSO: ఓట్లు సమానంగా వస్తే ..

ఎన్నికల టైంలో ఫోన్ల ట్యాపింగ్

రూపాయికే 1జీబీ డేటా

Latest Updates