టీఆర్ఎస్‌కు ఓటేస్తేనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యం

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, సాంస్కృతిక శాఖ చైర్మన్ శివ కుమార్‌లతో కలిసి తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. ఆ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కారు ప్రచారం చాలా ఉత్సాహంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నామని అనుకున్నారేమోగాని.. ఒక మానిఫెస్టో విడుదల చేశారు. ప్రభుత్వం సపోర్ట్ లేకుండా మున్సిపాలిటీలు అభివృద్ది సాధించలేవు. ఎన్నికల తర్వాత మున్సిపాలిటీల్లో కూడా అభివృద్ది పరుగులు తీస్తుంది. టీఆర్ఎస్‌ను బలపరిస్తేనే మున్సిపాలిటీలు అభివృద్ధిలో దూసుకు పోతాయి. 2014కు ముందు 24 గంటల కరెంట్‌ను ఎవరూ.. ఎక్కడా చూడలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 24 గంటల కరెంటు ఇస్తున్నాము.

కొంతమంది కులాలను, మతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. తాండూరు మున్సిపాలిటీ చైర్మన్ MIMకు ఇస్తున్నారని మీడియాలో వచ్చిన వార్తలను పట్టుకొని కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం చేస్తున్నాయి. మాకు MIMతో ఎలాంటి సంబంధం లేదు. TRS, MIMల స్నేహం కేవలం స్నేహపూర్వకం మాత్రమే. ఓల్డ్‌సిటీలో 7 అసెంబ్లీలకు మాత్రమే MIM పరిమితం. MIMకు ఒక్క కార్పొరేషన్ కూడా ఇవ్వం. బీజేపీ ఎంపీలు గెలిచినప్పటి నుంచి రాష్ట్రానికి ఏంచేశారో చెప్పాలి. తాండూరులో మున్సిపల్ చైర్మన్ MIMకు ఇస్తారని ప్రచారం చేస్తే కేసులు పెడతాం. భైంసాలో స్థానిక పరిస్థితులను బట్టి మూడు సీట్లు MIMకు ఏకగ్రీవం అయ్యాయి. ఆరేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్నివచ్చాయో.. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎన్ని వెళ్ళాయో ఒక్కసారి బీజేపీ నేతలు తెలుసుకోవాలి. బీజేపీ ఎంపీలు చెప్పేవన్నీగాలి కబుర్లు. మున్సిపల్ ఎన్నికల తర్వాత.. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై బీజేపీ నాయకులతో ఎక్కడైనా చర్చకు సిద్దం. రాష్ట్ర నాయకత్వం వచ్చినా సరే.. జాతీయ నాయకత్వం వచ్చనా సరే.. చర్చకు సిద్ధం. చైర్మన్, మేయర్ ఎన్నికల్లో మాకు ఎవరి సహకారం అవసరం లేదు. ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేస్తాము. చైర్మన్, మేయర్ పదవులు మా అభ్యర్థులకే వస్తాయి’ అని ఆయన అన్నారు.

For More News..

గర్ల్‌ఫ్రెండ్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి..

గిన్నిస్ బుక్‌లోకెక్కిన ప్రపంచపు పొట్టి వ్యక్తి ఇకలేరు

ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ స్టేడియం.. ఎంతమంది కూర్చొవచ్చంటే..

Latest Updates