ప్రజలే కేంద్రంగా పురపాలన ఉండాలి

ప్రజలే కేంద్రంగా పుర పాలన ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. మున్సిపల్‌ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో  సమావేశమైన ఆయన… మున్సిపల్‌ అధికారులు ప్రజలతో కలిసిపోవాలన్నారు. ప్రజలకు అందాల్సిన పౌరసేవలు పారదర్శకంగా, అవినీతిరహితంగా.. వేగంగా అందాలన్న లక్ష్యంతో అనేక విధానాలు తీసుకొస్తున్నామని తెలిపారు కేటీఆర్. అవినీతికి తావులేకుండా నిర్దిష్ట సమయంలో టీఎస్ బిపాస్ ద్వారా 21 రోజుల్లో ప్రజలకు భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలన్నారు. ఇందులో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు. మున్సిపల్‌ చట్టంలోని విధులనే జాబ్‌ చార్ట్‌గా భావించాలని, ప్రజలతో మమేకమయ్యేందుకు సోషల్‌ మీడియాను ఉపయోగించాలని తెలిపారు మంత్రి కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ బాస్‌లన్నారు.

Latest Updates