రోడ్డు ప్రమాదంలో గాయపడిన మురళీ మోహన్ కోడలు

Murali mohan daughter in law Maganti rupa injured in car accident

సినీ నటుడు, టీడీపీ ఎంపీ మురళీ మోహన్ కోడలు మాగంటి రూప రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శంషాబాద్ దగ్గర్లో ఆమె ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన మరోకారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సహాయకులు ఆమెను వెంటనే సమీపంలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం.

మురళీమోహన్ తల్లి వసుమతిదేవి (100) గురువారం ఉదయం విశాఖపట్నంలో అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారు. రూప ఆ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సన్నిహితులు చెప్పారు.

Latest Updates