వరల్డ్ కప్ లో ఇండియా, ఇంగ్లండ్ ఫేవరెట్స్ : మురళీధరన్

హైదరాబాద్ : వన్డే వరల్డ్ కప్ లో భారత్, ఇంగ్లండ్ జట్లు.. ఫైనల్ చేరే ఛాన్స్ ఉందన్నారు స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్. ఇండియా బౌలర్లు రాణిస్తుండటం జట్టుకి కలిసొస్తుందన్నారు. హైదరాబాద్ కు వచ్చిన  శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ మురళీధరన్…. ఫెరిట్ క్రికెట్ బాష్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొని… చిన్నారులకు మెళకువలు నేర్పించారు. భారత్ లో క్రికెట్ అంటే మతం లాంటిదన్నారు ముత్తయ్య. గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ ఉన్న చిన్నారులు ఎంతో మంది ఉన్నారని… వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు.

Latest Updates