38 ఏళ్ల కింద మర్డర్.. ఇప్పుడు అరెస్ట్

గుజరాత్‌లో ఒక పోలీస్ అధికారిని చంపిన నిందితుడు 38 ఏళ్ల తర్వాత అరెస్ట్ అయ్యాడు. రాజస్థాన్ కు చెందిన 66 ఏళ్ల శక్తిదాన్ సింగ్ పై 1980 దశకంలో ఒక పోలీసుతో పాటు.. మరో ఇద్దరిని కాల్చి చంపిన కేసు నమోదయింది. ఆ కేసుకు సంబంధించి శక్తిదాన్ సింగ్ ను 38 ఏళ్ల తర్వాత గుజరాత్ పోలీసులు జీజవాలా గ్రామంలో అరెస్టు చేశారు.

నిందితుడు 1982లో గుజరాత్ బనస్కాంత జిల్లాలోని ఇక్బాల్‌ఘర్ ప్రాంతంలో ఈ కాల్పులకు పాల్పడినట్లు బార్మర్ పోలీస్ సూపరింటెండెంట్ ఆనంద్ శర్మ తెలిపారు. ఆ కాల్పుల్లో ఒక పోలీసుతో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. శక్తిదాన్ సింగ్ పై 1980వ దశకంలో అతని సొంత రాష్ట్రమైన రాజస్థాన్‌లో 40 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అతనిపై రాజస్థాన్‌లో ఒక్క కేసు కూడా పెండింగ్ లో లేదు.

For More News..

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం

యూపీలో రాత్రికి రాత్రే మొదలైన లాక్డౌన్

Latest Updates