వీడియో: పోలీసుల కళ్ల ముందే నిందితుడిని కొట్టి చంపిన జనాలు

హత్యకేసులో నిందితుడిని పోలీసుల కళ్ల ముందే స్థానికులు కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సుధీర్ కుమార్ సింగ్ అనే వ్యక్తి రామ్‌పుర్ బాంగ్రా అనే గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడు సోమవారం ఉదయం వరుసకు సోదరుడైన వ్యక్తిచేతిలో హతమయ్యాడు. సోమవారం ఉదయం సుధీర్ కుమార్ స్నానం చేసి వచ్చే సమయానికే.. నిందితుడు అరిమన్ యాదవ్ అతని ఇంటికి చేరుకున్నాడు. సధీర్ కనిపించగానే యాదవ్ తనతో తెచ్చుకున్న తండ్రి తుపాకీతో కాల్పులు జరిపాడు. దాంతో సుధీర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తుపాకీ శబ్ధం విన్న స్థానికులు వెంటనే సుధీర్ కుమార్ ఇంటికి చేరుకున్నారు. సుధీర్ కుమార్ మృతదేహాన్ని చూసి స్థానికులు రగిలిపోయారు. దాంతో యాదవ్ వెంటనే గన్‌తో వారిని బెదిరించి పారిపోవడానికి ప్రయత్నించాడు.

కాగా.. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అప్పడు కూడా యాదవ్ గన్‌తో బెదిరించి ఓ ఇంటి టెర్రస్ పైకి ఎక్కాడు. అక్కడికి కూడా జనాలు, పోలీసులు రావడంతో.. అటునుంచి కిందికి దిగి ఓ రూంలోకి వెళ్లి తలుపు పెట్టుకోవాలనుకున్నాడు. కానీ, స్థానికుల కోపానికి.. యాదవ్ తప్పించుకోలేకపోయాడు. పోలీసులు నిందితుడికి రక్షణగా ఉండి అరెస్ట్ చేయాలని చూశారు. కానీ స్థానికులకు టీచర్ మీద ఉన్న గౌరవం.. నిందితుడిని రక్షించలేకపోయింది. పోలీసులు చూస్తుండగానే.. జనాలు రెచ్చిపోయి నిందితుడిని కర్రలతో, రాళ్లతో కొట్టి చంపారు. స్థానికుల దాడిలో నిందితుడి తల పగిలి రక్తం ధారలైంది. అయితే నిందితుడు అరిమన్ యాదవ్ మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ.. స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జిని ఎస్పీ వినోద్ మిశ్రా సస్పెండ్ చేశారు. యాదవ్.. సుధీర్ సింగ్‌ను చంపడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని ఆయన తెలిపారు.

For More News..

పేషంట్ చనిపోయిన తర్వాత కూడా వైద్యం పేరుతో దోపిడీ

కరోనా రిపోర్ట్ కోసం మనసు చంపుకొని డాక్టర్‌తో..

రాష్ట్రంలో మరో 2,932 కరోనా పాజిటివ్ కేసులు

ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి

Latest Updates