పెళ్లికి పోయి వస్తుండగా.. దారి కాసి

రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో అర్థరాత్రి దారుణం జరిగింది. ఓ వివాహ వేడుకలో పాల్గొని వస్తున్న చింతల్ మెట్ వాసి ఫిరోజ్‌పై అదే ప్రాంతానికి చెందిన వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఫిరోజ్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పాత కక్షలే ఈ హత్యకు దారితీశాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సర్వర్, మోసిన్ అనే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates