స్నేహితుల మధ్య గొడవ ప్రాణాలు తీసింది

నల్గొండ జిల్లా కనగల్ మండలం ధోరేపల్లిలో స్నేహితుల మధ్య గొడవ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ప్రవీణ్, బారపటి లక్ష్మణ్ అనే ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవలో లక్ష్మణ్ అక్కడికక్కడే మరణించాడు. వారం రోజుల క్రితమే వీరిద్దరి మధ్య గొడవ జరగగా…తాజాగా లక్ష్మణ్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ప్రవీణ్ పై గొడవకు దిగాడు. దీంతో నలుగురు వ్యక్తులపై ప్రవీణ్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో లక్ష్మణ్ అక్కడికక్కడే మరణించగా…మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ప్రస్తుతం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరారీలో ఉన్న ప్రవీణ్ కోసం గాలిస్తున్నట్లు సీఐ రవీందర్ చెప్పారు.

Latest Updates