ఆర్సీపురంలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య

రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మహిళా కానిస్టేబుల్ ను మరో కానిస్టేబుల్ దారుణంగా హత్య చేశాడు. సంచలనంగా మారిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. RC పురం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న మందారితను…, సంగారెడ్డి కంది పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న ప్రకాశ్ సోమవారం రాత్రి చంపేశాడు. గత కొద్ది రోజులుగా ప్రకాశ్, మందారిత చనువుగా ఉంటున్నట్లు చెబుతున్నారు. అయితే కానిస్టేబుల్ ప్రకాశ్ కు ఇప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. మహిళా కానిస్టేబుల్ వేరే వారితో చనువుగా ఉండడం తట్టుకోలేక ప్రకాశ్ ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తనతో క్లోజ్ గా ఉన్నట్లే మరొకరితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. నమ్మంచి బయటకు తీసుకెళ్లి దారుణంగా చంపేశాడు ప్రకాశ్. కేసు నమోదు చేసుకున్న రామచంద్రాపురం పోలీసులు…, కానిస్టేబుల్ ప్రకాశ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

Latest Updates