హైదరాబాద్ లో యువతి దారుణ హత్య

హైదరాబాద్‌: యువతిని దారుణంగా చంపేసిన ఘటన ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. నారాయణఖేడ్‌కు చెందిన రాధిక(24) ఆనే యువతిని హైదరాబాద్ లోని పాతబస్తీలో దుండగులు కత్తితో పొడిచి చంపారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు.

యువతిపై అత్యాచారం చేసి చంపేసినట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో తేలిందని తెలిపారు పోలీసులు. నారాయణఖేడ్‌కు యువతి మృతదేహాన్ని తరలించారు. తమ కూతురిని హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టామన్నారు. యువతి హత్యకు దారితీసిన కారణాల గురించి నిందితుల నుంచి మరిన్ని వివరాలను సేకరిస్తున్నామన్నారు పోలీసులు.

 

Latest Updates