సూర్యాపేట జిల్లాలో TRS నేత దారుణ హత్య

సూర్యాపేట జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఎర్కారం మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు వెంకన్నను గ్రామంలోనే కత్తులతో నరికి చంపారు దుండగులు. అయితే గత రెండు రోజులుగా సహాకార సంఘాల ఎన్నిక విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య గొడవలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ గొడవలే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. గతంలోనూ ఇదే గ్రామానికి చెందిన సర్పంచ్ , కాంగ్రెస్ నాయకుడు మిద్దె రవీందర్ హత్యకు గురయ్యాడు. ఇప్పుడు మళ్లీ హత్య జరగడంతో  గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

Latest Updates