వీడిన మర్డర్ కేసు మిస్టరీ: మద్యం మత్తులో బండరాయితో హత్య

మద్యం మత్తులో బండరాయితో మోది బామ్మర్దిని హత్య చేసిన బావ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది.  రక్తం మడుగులో ఉన్న మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా బండరాయితో మోది హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను వాటి ఆధారంగా నిందితుడిని ఉప్పల్ లో అదుపులోకి తీసుకున్నారు. ఓయూ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.   కూలిపని చేసే తిరుపతి రెడ్డి కి 1999 లో లక్ష్మి తో  వివాహం జరిగింది. అయితే  మృతుడు చందు కూలి పని చేసేవాడు. ఇద్దరు కూలి పని చేసేవారు కావడంతో స్నేహం కుదిరింది. చందు సోదరి మాధవితో తిరుపతి రెడ్డి పరిచయం ఏర్పాటు చేసుకుని ఆమెతో చనువుగా ఉంటూ కాపురం మొదలెట్టాడు. అయితే ఆమెకు అంతకు ముందే భర్త చనిపోయాడు. దాంతో తిరుపతి రెడ్డి తో సహజీవనం కొనసాగింది. విషయం తెలిసిన మొదటి భార్యకి తరచు గొడవ పడేది. మొదటి భార్యకు సర్దిచెప్పి ఇద్దరు భార్యలు వేరే వేరే ఇళ్లలో ఉంచి కాపురం చేస్తున్నాడు. అయితే తిరుపతి రెడ్డి నీ చీటికిమాటికి  బామ్మర్ది వరసైన చందు  తిడుతూ కొడుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలో రామంతపూర్ లో నివాసం ఉంటున్న తిరుపతి రెడ్డి కి బామ్మర్ది చందూ  వచ్చి కూలిపని చేస్తూ ఉండగా తాగుదాం అంటూ బామ్మర్ది చందును పిలిచాడు. ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం వెంటబెట్టుకొని వెళ్లి ఓయూలోని  చెరువు సమీపంలో నిర్మానుశ్య ప్రదేశంలో తాగారు.  వీరిద్దరు మద్యం మత్తులో మాట మాట పెరిగి తిరుపతి రెడ్డి బండరాయితో  చందు తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడి నుంచి తిరుపతి రెడ్డి యాదగిరిగుట్ట కు పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు పరారీలో ఉన్న తిరుపతి రెడ్డి ని గురువారం ఉప్పల్ సమీపంలో లో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్​కుతరలించారు. అయితే ఈ గొడవకు చందు, సోదరుడు, నాన్న అందరు చీటికిమాటికి తిడుతూ ఉన్నారని, అందుకే హత్య చేశానని పోలీసుల విచారణలో తిరుపతి రెడ్డి వెల్లడించాడు. ఈ కార్యక్రమంలో డిఇ రమేష్ నాయక్, ఓయూ ఎస్సై లు, పోలీసులు పాల్గొన్నారు.

Latest Updates