కొత్త కరోనా లక్షణాలు: రెండు రోజుల్లోనే బయటపడతాయి

కరోనా వైరస్ సోకిన వ్యక్తిలో వ్యాధి తీవ్రతరం ఎక్కువైతే కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది.

వైరస్ సోకిన వ్యక్తిలో జలుబు, దగ్గు, శ్వాసకోస సంబంధిత సమస్యలు తలెత్తున్న విషయం తెలిసిందే. తాజాగా అవి కాకుండా చలి, చలితో వణకడం, గొంతు నొప్పి, కండరాల నొప్పి, రుచి, వాసన శక్తిని కోల్పోతున్నట్లు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది.

ఈ లక్షణాలు వైరస్ సోకిన వ్యక్తిలో 2 నుంచి 14 రోజుల మధ్య ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉందని తెలిపింది.  గుండెల్లో నొప్పి, గుండెలపై ఒత్తిడి, పెదాలు, మొహం నీలం రంగులోకి మారుతున్నట్లు యూఎస్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వెల్లడించింది.

Latest Updates